
చేపల మేతగా చచ్చిన కుళ్ళిపోయిన కోళ్ల మాంస వ్యర్ధాలు ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం చోద్యం చూస్తున్న అధికారులు మామూళ్ల మత్తులో జోగిసలాటలు
చిలకలూరిపేట: పట్టణానికి కూత వేటు దూరంలో ఓగేరు వాగుకి దగ్గరలో కొన్నేళ్లుగా చేపల చెరువుల పెంపకం జరుగుతున్నది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలని దురాశతో చేపల మేతగా వేరుశెనగ చెత్త తవుడు సోయాబీ లేట్లను వాడాల్సి ఉంది ఈ విధమైన సాంప్రదాయ మేతకు ఖర్చు ఎక్కువ అవుతుంది కాసులకు కక్కుర్తి పడి చేపల చెరువుల యజమానులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రోగాలు వచ్చి చనిపోయిన కోళ్లను కుళ్లిపోయిన వాటి వ్యర్ధాలను కుళ్లిపోయిన కోడిగుడ్లను వాటి ఈకలను ఇతర మాంస వ్యర్ధాలను పట్టపగలే మాంస దుకాణాల నుంచి స్వీకరించి భారీ వాహనాలలో చేపల చెరువుల వద్దకు తరలిస్తున్నారు ఇలా పెంచిన చేపలను తినడం వలన ప్రజలు అనారోగ్య పాలు కావలసి ఉంటుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు ప్రభుత్వం నిషేధించిన క్యాట్ ఫిషెస్ నీ చెరువులలో అక్కడక్కడ రహస్యంగా పెంచుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు
కుళ్ళిన మాంసం వ్యర్ధాలు వలన విపరీతమైన దుర్వాసన వేస్తుందని చుట్టుపక్కల తిరుగుతున్న ప్రజానీకం చెప్పుకుంటున్నారు కోళ్ల వ్యర్ధాలేనా ఏమైనా చనిపోయిన జంతుకళేబారాలు వేస్తున్నారేమో అని భయాందోళనకు గురి అవుతున్నారు ఇటువంటి వ్యర్ధాలను సేకరించి నిలువవుంచి అందువలన పర్యావరణానికి ఎంతో ముప్పు పొంచి ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు
ఈ చెరువుల నీటి నిర్వహణకు పక్కనే ఉన్న ఓగేరు వాగు నుంచి పెద్దపెద్ద మోటార్లతో నీటిని తోడుకుంటున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు దీనివలన ఈ నీటి మీదే ఆధారపడి సేద్యం చేసుకుంటున్నా కొన్ని పంటలకు నీరు అందడం లేదని రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకుంటున్నారు
కోళ్ళ వ్యర్ధాలను మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2016 లో జీవో నెంబర్ 56 జారీ చేసింది ఈ జీవో వలన ఇలా కుళ్ళిన మాంసం స్వీకరించిన వాహనాలను సీజ్ చేసి వారి లైసెన్సును రద్దు చేస్తారని తెలుస్తుంది ఇలా వ్యర్ధాలతో సాగు చేస్తున్న చెరువుల రిజిస్ట్రేషన్ ను రద్దు వంటి చర్యలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేపడతారని తెలుస్తుంది సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం పర్యావరణ రక్షణ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు
