
ప్యాసింజర్ రైలులో మంటలు
డెమో ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును బీబీనగర్ వద్ద నిలిపివేశాడు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపింది.
కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
