చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం కాలవడ్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం మొదటి నాగుల చవితి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం 3 గంటల నుండి పుట్టలకు పాలు పోసి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అన్నదాన కార్యక్రమం నిర్వహణలో భాగంగా సంక్రాంతి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుమార్తె శ్రీలత, కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ,సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కోరిన కోరికలూ తీర్చే శ్రీ అభయాంజనేయ స్వామి కార్తీక మాసంలో పూజ చేసే ప్రతి భక్తుడు యొక్క కోరిక తీర్చాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ సంక్రాంతి లక్ష్మీనారాయణ,సంక్రాంతి లక్ష్మయ్య, కరుణాకర్, రాజశేఖర్, విజయ శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
Related Posts
క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..
TEJA NEWS క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు… కోదాడ సూర్యాపేట జిల్లా భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ఆనవాయితీను దానిలో భాగంగా కోదాడ మండల కేంద్రంలోని క్రాంతి ఫౌండేషన్…
ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
TEJA NEWS ధర్మపురి :- ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .ఈ సందర్భంగా ఈ నెల నాలుగవ తేదిన పెద్దపెల్లి లో…