TEJA NEWS

ఉగ్రవాదంపై పోరాటంలో విజయం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
– మోదీకి మద్దతుగా బీజేపీ నాయకులు

ఎడ్లపాడు మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం ఉగ్రవాదులపై పోరాటంలో భారత సైనికులు విజయం సాధించాలని, దేశ రక్షణ కోసం పోరాడుతున్న వారికి దైవ ఆశీస్సులు కలగాలని కోరుతూ బీజేపీ మండల నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. దేశ రక్షణ కోసం మోదీ చేస్తున్న యజ్ఞానికి దైవ బలం కూడా తోడవాలని ప్రార్థించారు.

పూజల కార్యక్రమంలో ఎడ్లపాడు బీజేపీ మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేగేసిన
అంజిరాజు, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, రావూరి సుబ్బారావు, అయిలవరపు రామారావు, బందెల శ్రీనివాసరావు, భీమరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.