
పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్పులకు సాధించిన విద్యార్థులను సన్మానించిన……..జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఎస్పీ సూచన
వనపర్తి
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు.
- పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలలలో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… పిల్లలు చిన్న వయసు నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అందు కోసం తమ శాయశక్తుల కృషి చేయాలని సూచించారు. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని తెలిపారు. పిల్లలు సంస్కారాని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆయన కోరారు. అనంతరం ఇంటర్మీడియట్, పదవ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన సాయి శరణ్య, శ్రీ చరణ్,భార్గవి,అమూల్యశ్రీ, లను ఎస్పీ శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,మారోజు తిరుపతయ్య, యాదగిరి, గౌరవాధ్యక్షులు, బైరోజు చంద్ర శేఖర్, సూర్యనారాయణ,మాజీ కౌన్సిలర్, బ్రహ్మచారి, డా.బి.శ్యాం సుందర్,అరవింద్,ప్రకాష్, రామ్మోహన్, శ్రీనివాసాచారి, శ్రీశైలం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
