
ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
హనుమకొండ జిల్లా..:
ఎర్రగట్టు గుట్ట శ్రీ శ్రీ శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ….

తొలుత ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే నాగరాజు ని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు…
అనంతరం ఎమ్మెల్యే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు…
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరెల్లి లింగస్వామి డైరెక్టర్లు మరియు టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మానీ శేకర్ రావు, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ గడ్డం శివరాం ప్రసాద్, మార్క రాజు, చిర్ర రాము, వీసం సురేందర్ రెడ్డి, సంతోష్, గడ్డం అరుణ్, వరుణ్, సుమంత్ తో పాటు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….