TEJA NEWS

సెంట్రల్ యూనివర్సిటీలో భూమి పరిరక్షణ కోసం విద్యార్థులు చేసిన ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను.

యూనివర్సిటీ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెటట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

తమ భూమిని కాపాడుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ నిరసన తెలియజేస్తుంటే పోలీసు బలగాలతో వారిపై లాఠీచార్జి చేసి చితకబాద డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సమస్య మూలాలను అర్థం చేసుకోకుండా విద్యార్థుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తే ఆ విద్యార్థులే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు గతంలో అనేకమార్లు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు, విద్యార్థులు చేస్తున్న పోరాటం సరైనదే అంటూ ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశారు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం గురించి రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నాను. అందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉందాం, యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం.

క్రాంతి కిరణ్
మాజీ ఎం ఎల్ ఏ ఆందోల్
ఫౌండర్ జనరల్ సెక్రటరీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్