కార్మికుల సౌకర్యార్థం జీడీకే 2&2ఏ ఇంక్లైన్‌లో నూతన ఎస్కార్ట్ వాహనం ప్రారంభం…

TEJA NEWS

కార్మికుల సౌకర్యార్థం జీడీకే 2&2ఏ ఇంక్లైన్‌లో నూతన ఎస్కార్ట్ వాహనం ప్రారంభం…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని జీడీకే 2&2ఏ ఇంక్లైన్‌లో యాజమాన్యం నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ వాహనాన్ని గని అధికారులు పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ, జీడీకే 2&2ఏ ఇంక్లైన్‌లో భారీ మెటీరియల్ లోడింగ్, అన్‌లోడింగ్ పనుల సమయంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఏఐటీయూసీ యూనియన్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, నూతన ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలన్న వినతికి యాజమాన్యం సానుకూలంగా స్పందించి వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్మికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నూతన వాహనాన్ని ప్రారంభించినందుకు ఏఐటీయూసీ తరఫున యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గని అధికారులు రమేశ్ బాబు, ఎస్.కే. అల్లాఉద్దీన్, డి. వెంకటేశ్వర్లు, కుమారస్వామి, మల్లేశం, హరీష్, తిరుపతి, దామోదర్ పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శులు పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, నాయకులు పులి రవి, కొత్త రాజయ్య, మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top