TEJA NEWS

మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని కలిసిన వాసవి ఎంక్లేవ్ కమిటీ వారు ||

(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాసవి ఎంక్లేవ్ వార్డ్ నెం . 22 లోని పలు కాలనీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తెలియజేసారు. హన్మంతన్న వాటి పరిష్కారం కోసం, కాలనీలోని అభివృద్ధి కోసం పై అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో సమస్యల్ని పరిష్కరించాలని తెలిపారు . అనంతరం కమిటీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మెడ శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ భవాని ప్రసాద్, కోశాది కారి రమేష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, సంశివరావు మరియు పవన్ పాల్గొన్నారు.