TEJA NEWS

మధురై తాటి బెల్లం కాఫీ ” ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్ …

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ అలీఫ్ సర్కిల్ వద్ద వినయ్ గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మధురై తాటి బెల్లం కాఫీ” ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మధురై తాటి బెల్లం కాఫీ యజమానులు ముఖ్య అతిధులను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ యువత ఉద్యోగాన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.