ఉత్తమ ఫలితాలు సాధించిన నవజ్యోతి పాఠశాల విద్యార్థులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….

TEJA NEWS

ఉత్తమ ఫలితాలు సాధించిన నవజ్యోతి పాఠశాల విద్యార్థులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ * షాపూర్ నగర్ వారి నివాసంలో గిరి నగర్ డివిజన్ పరిధిలోని నవజ్యోతి పాఠశాలలో విద్యను అభ్యసించిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన ఆ పాఠశాల విద్యార్థులను *స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ * విద్యార్థులను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులందరూ మరింత ఉన్నతమైన ఫలితాలను సాధించి జీవితంలో మంచి స్థాయికి వివిధ రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు..

అదేవిధంగా అత్యున్నతమైన ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం గౌడ్ నగదు బహుమతి సైతం విద్యార్థులకు అందజేశారు..

ఈ ఫలితాలను సాధనకు కృషిచేసిన పాఠశాలలోని ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉన్నత ఫలితాలను పాఠశాల యజమాన్యం సాధించాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఇంద్రా రెడ్డి , స్కూల్ ఇన్చార్జ్ రామిరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణారెడ్డి, మరియు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top