Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం లో స్వామి వారిని దర్శించడం జరిగింది. అనంతరం మహా శివరాత్రి సందర్భంగా స్థానిక డివిజన్ వాసులు అభిషేక్, సంతోష్,చంద్రశేఖర్,నాగేశ్వరావు,వెంకటరత్నం,రామలింగం,అనిల్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షను విరమించిన భక్తులకు,ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని తెలియజేస్తూ అన్నదాన నిర్వాహకులకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ సీనియర్ నాయకులు అధ్యక్షులు సుబ్బారెడ్డి, వెంకటేష్,బట్ట మురళీ,గాలి శ్రీనివాస్, గోల్కొండ శ్రీను,లడ్డు,చందు,ఫేస్ 3 ప్రెసిడెంట్ సి. హెచ్. మహేష్,యువ నాయకులు,మహిళా నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.