Spread the love

భర్త హత్యకు సుపారి.. ప్రియుడు తో కలిసి పక్క ప్లాన్..

ఉమ్మడి వరంగల్ జిల్లా జోనల్ ఇన్చార్జి

వరంగల్ లో యువ వైద్యుడు పై ఆత్మహత్యం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు డాక్టర్ భార్య ప్రధాన సూత్రధారి అని తేల్చారు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు తో కలిసి భర్తను చంపాలని పథకం వేసినట్లు వివరించారు నిందితులైన గాదే ఫ్లోరా మరియ (వరంగల్) ఆమె ప్రియుడు ఏరోల్ల శామ్యూల్ సంగారెడ్డి. వారికి సహకరించిన ఏ ఆర్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (సంగారెడ్డి) నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు వరంగల్ ఏసీబీ నందిరామ్ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగింది

వరంగల్ కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి కి ఫ్లోరా మరియా తో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. 2018లో సంగారెడ్డి లో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండగా వాటిని చూసుకోవడం కోసం అతను భార్య ఫ్లోరా మరియ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పీహెచ్ లో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తుండగా తన భార్య ఫ్లోరా మరియ స్కూల్లో టీచర్ గా పని చేస్తుండేది బరువు తగ్గడానికి ఆమె సంగారెడ్డి లోని సిద్దు సెంటర్కు వెళ్తుండేది జిమ్ సెంటర్ కోచ్ గా పని చేస్తున్న ఎర్రోళ్ల శామ్యూల్ పరిచయ మయ్యాడు వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది ఈ విషయం సుమంత్ రెడ్డికి తెలవగా భార్య భర్తలకు గొడవలు జరిగేవి ఇట్టి గొడవల కారణంగా డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడ నుంచి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేశారు 2019 సంవత్సరంలో ఫ్లోరా మరియ లెక్చరర్ ఉద్యోగం పొంది జనగామ జిల్లా లోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ అక్కడ ఉండేవారు తర్వాత కాలేజ్ వరంగల్ లోని రంగసాయిపేట కి మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేట లోని ప్రైవేట్ హాస్పటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తూ ఉండేవాడు ఫ్లోరా మరియ మాత్రం సంగారెడ్డి లో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ ఇంటికి పిలిపించుకొని అతడితో వివాహేత్రర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది ఇది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించే వారు

ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి దీంతో ఫ్లోరా మరియ, శామ్యూల్ డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు శామ్యూల్ ఈ విషయాన్ని స్నేహితుడు ఐ ఆర్ కానిస్టేబుల్ రాజు కుమార్ కు చెప్పాడు డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకు సహకరిస్తే సంగారెడ్డిలో ఇంటినీ నిర్మానించి ఇస్తానని చెప్పగా దానికి సదరు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకున్నాడు 15 రోజుల క్రితం లక్ష రూపాయలు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చేయగా అందులో నుంచి ఖర్చులకు 50 వేల రూపాయలు శామ్యూల్ తీసుకొని మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇచ్చాడు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం సంగారెడ్డిలో సుత్తిని కొనుగోలు చేసి రాజ్ కుమార్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలు దేరి కాజీపేటకు వచ్చి ముందుగా అనుకున్న ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసేందుకు సీసీ కెమెరాలు జన సంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకున్నారు సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్ క్లోజ్ చేసి బట్టుపల్లి రోడ్డు నుంచి రంగసాయిపేట్ వెళుతున్న క్రమంలో వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో డాక్టర్ సుమంత్ రెడ్డిని కారును పక్కకు పెట్టించి శామ్యూల్ రాజ్ కుమార్ విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు చనిపోయాడు అనుకుని భావించి అక్కడి నుండి వారు పారిపోయారు డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసును వరంగల్ ఏసీపీ నందిరాం ఆధ్వర్యంలో మిల్క్ కాలనీ సిఐ వెంకటరత్నం దర్యాప్తు చేసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.