Spread the love

ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా గురువారం సందర్శించారు. హసన్ పర్తి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలతో పాటు హన్మకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ సిపి సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించడం తో పాటు పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రంలో మౌలిక వసతుల ఏర్పాట్ల పై సీపీ ఏసీపీలు, ఇన్స్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.