Spread the love

త్వరలో మాజీమంత్రి హరీష్ రావు పాదయాత్ర

TG: బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీష్ రావు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద హరీష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులపాటు 130 కి. మీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లో రోజుకో సభనిర్వహిస్తారు. కాగా చివరి రోజు సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.