TEJA NEWS

బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీమంత్రి ప్రత్తిపాటి

  • భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు, ఆలయనిర్వాహకులకు సూచించిన ప్రత్తిపాటి
  • సాంస్కృతిక కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ వారిని ఆదేశించిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట మండలంలోని బొప్పూడిలో నేడు ప్రారంభమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 42వ వార్షికోత్సవం, తిరునాళ్లలో మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న ప్రత్తిపాటి, ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారు చాలా మహిమగలవాడని, ఆంజనేయుని నమ్ముకున్నవారికి ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవని ప్రత్తిపాటి తెలిపారు.