
అస్వస్థతకు గురైన శంకర్ నాయక్ కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శ..!
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ను మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. హనుమకొండలో ఉన్న శంకర్ నాయక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే రోహిణి హాస్పిటల్ లో వైద్య చికిత్స తీసుకుంటున్నారు, ఆయనను పరామర్శించిన సత్యవతి రాథోడ్ శంకర్ నాయక్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. చికిత్స పొందిన తర్వాత తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని సత్యవతి రాథోడ్ కు శంకర్ నాయక్ చెప్పారు. తగినంత విశ్రాంతి తీసుకుని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని శంకర్ ను సత్యవతి రాథోడ్ కోరారు
కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సీత మహాలక్ష్మి, మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ మండల బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ నాయక్, మండల బి.ఆర్.ఎస్ వైస్ ప్రెసిడెంట్ గంధము ఉప్పలయ్య,మహబూబాబాద్ నియోజకవర్గ తాజా మాజీ సర్పంచులు బొబ్బ వెంకటరెడ్డి (మాదాపురం), హరి నీలవేణి నాయక్ (బలరాం తండా), రామచంద్రనాయక్,కిషన్ నాయక్ (శితుల తండా), పంజాల సాయిలు (జంగిల్ గొండ) తదితరులు
