
కార్పొరేటర్ కు మాజీ ఎమ్మెల్యే భూమన పరామర్శ
తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న 50వ డివిజన్ కార్పొరేటర్ బోకం అనిల్ ను మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. దళిత కార్పొరేటర్ కు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని దూయ్యబట్టారు. తిరుపతిలో ఎన్నడు లేని విధంగా హత్యా రాజకీయాలు పెంచి పోషిస్తున్నారని విమర్శించ్చారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు హత్యా రాజకీయాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్ అనిల్ పై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని భూమన డిమాండ్ చేశారు. పోలీసులపై నమ్మకం ఉంది, ఎస్పీ పై నమ్మకం ఉంది..లేని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని హెచరించారు. అగ్రవర్ణాల నాయకులతో కలిసి దళిత కార్పొరేటర్ పై దాడి చేసి, హత్య చేసేందుకు కుట్ర చేశారని విమర్శించ్చారు.
