Spread the love

పలు ఆహ్వానాలను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారిని సూరారం గ్రామ శ్రీ కట్టమైసమ్మ తల్లి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర,నిజాంపేట గ్రామ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి 124వ వార్షికోత్సవ జాతరకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు..

అనంతరం దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూరారంలో నిర్వహించే భారత రాజ్యాంగ పరిరక్షణ సభకు ఆహ్వానించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు.. వారి ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, ఏనుగుల కృష్ణారెడ్డి, వారాలవినోద్, నేమూరి రమేష్, జేమ్స్, అమర్ బాబు, బండి శ్రీనివాస్ గౌడ్, పులి సందీప్, ఆయుష్ దీక్షిత్, సిద్దయ్య, సత్తిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏసురత్నం, మల్లేష్ యాదవ్, వారాల మహేష్, తదితరులు పాల్గొన్నారు