
లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన రామగుండం శ్రీనివాస్ కు రూ.44,000/-, యండి. ముజీబ్ కు రూ.38,500/-, రైక శేఖర్ గౌడ్ కు రూ.60,000/-ల చెక్కులు అందజేశారు..
అనంతరం పలు సమస్యలతో వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి ఆహ్వానాలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— సిఎంఆర్ఆఫ్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందన్నారు..
— రాష్ట్రంలో ప్రతి సామాన్యునిడికి సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం అన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్యులు దామోదర్ రాజానర్సింహా ప్రత్యేక చొరువతో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సదుపాయాలు, సేవలు చాలా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
