TEJA NEWS

గాజులరామారంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం పండితుల వేదమంత్రాల మధ్య స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

హనుమాన్ జయంతి సందర్భంగా గాజులరామారంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..

— శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అనుగ్రహం, స్వామి వారి చల్లని దీవెనలు నియోజవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరారు..

ఈ కార్యక్రమంలో సారా నాగేంద్ర వర్మ, యాంసాగర్, గోమారం లక్ష్మ రెడ్డి, రామకృష్ణ, యశ్వంత్ రెడ్డి, సుజిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవికిరణ్, సాయి కిరణ్ రెడ్డి, హేమంత్, శ్రీరాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు..