TEJA NEWS

ఒక్షిత్ హిల్ వ్యూ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ గాజులరామారంలో ఒక్షిత్ హిల్ వ్యూ కాలనీవాసుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఒక్షిత్ హిల్ వ్యూ కాలనీలో పర్యటించి డ్రైనేజి సమస్యను పరిశీలించారు..

అనంతరం కాలనీవాసులతో కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— గత పాలకుల పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి చెందలేదన్నారు.

— మన ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి,పల్లి నరేష్ రెడ్డి,కృష్ణ గౌడ్,సురేందర్, రామానాయుడు, శ్రీధర్, విజయ్, కుమార్, సాగర్ తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు..