
పూరి జగన్నాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు వి.చంద్రారెడ్డి
బొల్లారం మున్సిపాలిటీ వైయస్సార్ కాలనీలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మహా యజ్ఞోత్సవం-పార్శ్వ మందిరాల ప్రతిష్టోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలిసి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజారుల నుంచి వారు ఆశీర్వచనాలు పొందారు. దేవతామూర్తుల ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషనియమని అన్నారు. ఈ సందర్భంగా నాయకులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. స్థానిక భక్తులే కాకుండా నగరానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చక్రపాణి, లక్కన్, ధర్మేందేర్ యాదవ్, ఉమాకాంత్, సునీల్ సింగ్, తివారీ, బసంత్పెర, జితేందేర్ యాదవ్, సునీల్ సింగ్, అశ్వక్ యాదవ్, పద్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
