
జగన్ హయంలో మాజీ ఎంపి నాని గళం ఇసుక దోపిడిలో వాటాలు తీసుకోవటం వల్లే మూగబోయింది : ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు
కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం
రాష్ట్రాభివృద్ది చూసి ఓర్వలేక నానికి కడుపు ఉబ్బరం, కళ్లు మంటలు
నానికి ఈనో ప్యాకెట్, ఐ డ్రాప్స్ పంపించిన గొట్టుముక్కల
విజయవాడ : జగన్ పాలనలో ఒక మాఫియాగా ఏర్పడి ఇసుక ను బకాసురులుగా దోచుకున్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా వున్న సమయంలో జగన్ పాలనలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతో పనులు లేక 64 మంది భవననిర్మాణ ఆత్మహత్య చేసుకున్నారు.. జగన్ పాలనలో టన్ను ఇసుక 2000 నుంచి 2400 రూపాయల వరకు అమ్మారు..అప్పుడు సోషల్ మీడియా లో జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టలేదు. జగన్ దగ్గర ఎంత కమీషన్ పుచ్చుకున్నావు. మాజీ ఎంపి నాని గళం ఆ ఇసుక దోపిడిలో వాటాలు తీసుకోవటం వల్లే మూగబోయిందంటూ మాజీ ఎంపి కేశినేని నాని పై ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి వ్యాపార భాగస్వామిగా నాని చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవటానికి జగన్ వదిలిన బాణంగా ఎంపి కేశినేని శివనాథ్ పై మాజీ ఎంపి కేశినేని నాని సోషల్ మీడియాలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గొట్టుముక్కల రఘురాజు శనివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావటంతో భవన నిర్మాణ కార్మికులకి పనులు దొరికి ఆనందంగా వుంటే నాని ఎందుకు చూసి ఓర్వలేకపోతున్నాడో అర్ధం కావటం లేదన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు యాష్ కి టెండర్లను పిలిచి పారదర్శకంగా చేస్తుంటే కళ్ల మంటలతో కళ్లు వుండి గుడ్డి వాడిగా యాష్ దోపిడి జరుగుతుందంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడన్నారు. అందుకే నానికి కడుపు ఉబ్బరం, కళ్ల మంటలు తను పంపిస్తున్న ఈనో ప్యాకెట్, ఐ డ్రాప్స్ వాడి తగ్గించుకోవాలని సూచించారు.
తన ప్రయోజనాల కోసం స్వార్థపూరిత ఆలోచనలు చేసే కేశినేని నాని విజయవాడ అభివృద్ధిని మాత్రమే కాదు, ప్రజలను, టిడిపి కార్యకర్తలను ఎనాడు పట్టించుకోలేదన్నారు. శ్రమ ఒకరు పడితే చివరిలో వచ్చి పేరు తాను కొట్టేసేవాడని, కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కోసం ఉద్యమాలు చేస్తే…చివరలో వచ్చి అంతా తనే చేసినట్లుగా క్రెడిట్ దక్కించుకున్నాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంపి కేశినేని శివనాథ్ పై పెడుతున్న పోస్టులు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు వుందని ఎద్దేవా చేశారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపి కేశినేని శివనాథ్ చేస్తున్న అభివృద్ది ని చూసి తట్టుకోలేక కేశినేని నాని విషం చిమ్ముతున్నాడన్నారు. కేశినేని నాని పార్టీ మారక ముందు కోవర్ట్ పని చేసి, పార్టీ మారిన తర్వాత నుంచి నిలువెల్లా విషం నింపుకుని కాటు వేసే నానిగా మారాడన్నారు. రాష్ట్రాభివృద్ది ని అడ్డుకోవాలనుకునే ఎమ్మెల్యే జగన్ కి కేశినేని నాని ఒక బపూన్ లా దొరికాడని, అందుకే కేశినేని శివనాథ్ పై అసత్య ఆరోపణలు చేస్తూ విష ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా నాని బుద్ది తెచ్చుకుని వైఖరి మార్చుకోకపోతే విజయవాడ ప్రజలు తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా వున్నారని హెచ్చరించారు. మీడియా సమావేశంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్ పాల్గొన్నారు.
