
బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ కి. శే రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ ప్రధాని స్వర్గీయ కి. శే రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పుల మల వేసి ఘణ నివాళుల్పించిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * . అంనతరం హన్మంతన్న మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైసి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, NMC మహిళ అధ్యక్షురాలు కడియాల ఇందిరా మరియు డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
