Spread the love

అభివృధ్ధి పనులకు శంకుస్థాపన

51 వ డివిజన్ పరిధిలోని పీతాని అప్పలస్వామి వీధి లో రూ 5 లక్షల 50 వేలతో చేపట్టిన మెట్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,51 వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు.
కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి పాలనలో పశ్చిమ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
సుజనా చౌదరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహదేవు అప్పాజీ రావు, అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు, ఎన్డీయే కూటమి నేతలు సారేపల్లి రాధాకృష్ణ, కుంచం దుర్గారావు విఎంసి ఇంజినీరింగ్ అధికారులు సచివాలయ సేక్రటరీలు పాల్గోన్నారు.