
కర్ణాటక రాష్ట్రంలో ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు గద్వాల్ వాసులు మృతి..
కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా మనగులి సమీపంలో 21.05.25 తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో సంభవించిన ప్రమాదం ఈ ఘటనలో కారులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన టి. భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్నతో పాటు కారు డ్రైవర్ శివప్ప అక్కడికక్కడే మృతి చెందగా భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భాస్కర్ పట్టణంలోని కెనరా బ్యాంకులో విధులు నిర్వహిస్తు వారి కుటుంబ సభ్యులతో గద్వాల్ బీసీ కాలనీలో నివసిస్తున్నారు.
