
మహాశివరాత్రి సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శివదీక్ష శిబిరముల (26/02/2025) ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడినది.ఈ కార్యక్రమం శ్రీశైలం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్.యమ్.స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 100 మందికి పైగా కాలినడకన వచ్చిన భక్తులకు ఆయుర్వేద వైద్యం అందించడం జరిగినది.
