TEJA NEWS

అత్తివరంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

a తిరుపతి: టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం ఓజిలి మండలంలోని వజ్జావారిపాళెం పిహెచ్ సి, అత్తివరం పిహెచ్ సిలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

పింక్ బస్ క్యాంపులు జరిగే ప్రాంతాలు

  • జులై 11న చెంబేడు, పెళ్లకూరు.
  • జులై 14న దొరవారిసత్రం, తొగరముడి.
  • జులై 15న గొట్టిప్రోలు, పేర్నాడు.
  • జులై 17న తడ, రామాపురం.
  • జులై 18న మల్లాం, ఈశ్వరవాక.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వజ్జావారిపాళెం వైద్యాధికారులు డాక్టర్ ఎ.మాధవ్, డాక్టర్ గీతా, డాక్టర్ నీలిమ, అత్తివరం వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, ఎంపిహెచ్ఈవో కె.చిన్నయ్య, హెచ్.వి.పద్మావతి, ల్యాబ్ టెక్నీషియన్ బాలకృష్ణ, ఎంఎల్ హెచ్ పిలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.