అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపు
జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల.
…. నెల్లూరు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని, జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు, పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ వైద్య నిపుణులచే ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సి.హెచ్. సౌజన్య ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజాసేవకే అంకితమైన పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుంది.. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. పోలీస్ సిబ్బంది వారి పోలీస్ కుటుంబాలు వైద్య పరీక్షలు చేయించుకుని నిజజీవితంలో ఆరోగ్యంగా ఉండాలనిఅన్నారు.
