Spread the love

ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి*

ఏపీలోని విజయవాడ నగరం లో అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇక నుంచి అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచిఉండబో తున్నాయి. నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చేశాయి. ప్రజల సౌకర్యంతో పాటు హోటళ్ల మనుగడ కోసం రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచాలంటూ తాము చాలాకాలంగా కోరుతున్నామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి పేర్కొన్నారు.