Spread the love

ఉపాధి హామీ నిధులతో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కు దారపనేని, బైరెడ్డి కృతజ్ఞతలు

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని దారపనేని క్యాంపు కార్యాలయంలో బుధవారం పత్రిక విలేకరుల సమావేశంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. 2018, 19 ఆర్థిక సంవత్సరంలో తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీకి రోడ్లకు సంబంధించి 93 లక్షలు ఉపాధి హామీ విధులతో మంజూరు చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటంతో ఆ రోడ్ల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రతిపాదనలతో పామూరు ఏఇ, కనిగిరి డిఇ, కందుకూరు ఇఇ ఒంగోలు ఎస్ సి డ్వామ పిడి ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగినది.

దీనిపైన తూర్పు కోడిగుడ్లపాడు టు బొందల్ రోడ్డు, 20 లక్షలు, తూర్పు కోడిగుడ్లపాడు వరవరోడ్డు టు వయా కుమారస్వామి ఇంటి మీదుగా ఎన్జీవో కాలనీకి 73 లక్షల 30 వేలు నిధులతో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా ఎం జి ఎన్ ఆర్ ఇ జీ ఎస్ రూరల్ డెవలప్ మెంట్ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్ ని కలిసి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ప్రతిపాదనలు అందజేశారు. స్పందించిన ఆయన త్వరలో అనుమతులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు దారపనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు మాజీ ఎంపీటీసీ చెనికల పెదమాల కొండయ్య,తూర్పు కోడిగుడ్లపాడు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు దారపనేని రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు, పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య సుబ్బయ్య, పోకా నాయుడు బాబు, యరసింగ్ రాయుడు పాల్గొన్నారు.