TEJA NEWS
  • సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు గా జి.రవికుమార్
    *-
    నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్. వనపర్తి
    సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని జి.రవికుమార్ అన్నారు.సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా మదనాపురం మండలానికి చెందిన జి.రవికుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైయినా జి.రవికుమార్ మాట్లాడుతూ… ప్రతి సామాన్యుడుకి సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం అన్నారు.సమాచార హక్కు చట్టం (RTI) సామాన్యులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం పొందేందుకు ఈ చట్టం ద్వారా ప్రజలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే హక్కును పొందవచ్చు అన్ని తెలిపారు.ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు అందించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని,ఆర్టీఐ పై అవగాహన కార్యక్రమాలు చేపడతానని, సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.సమాచార హక్కు చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత,జవాబుదారితనం సాధ్యమన్నారు.తన పైన ఉన్న నమ్మకంతో తనకు బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.