
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజులరామారం సర్కిల్ పరిధి లోని గాజులరామారం సంబందించిన పోలింగ్ స్టేషన్ల లో గల పోలిటికల్ పార్టీ ప్రతినిధులతో SPECIAL INTENSIVE REVISION (SIR) పై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు మరియు కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను గురించి చర్చించడం జరిగినది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో చర్చించిన విధంగా, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/స్థాన మార్పు కోసం ఏవైనా సూచనలు ఉంటే సమర్పించవలసిందిగా కోరడమైనది.
ఏదైనా పోలింగ్ కేంద్రం యొక్క స్థల మార్పు అవసరమైనా లేదా దానిని మెరుగుపరచడానికి ఏవైనా సూచనలు ఉన్నా, దయచేసి ఆ ప్రతిపాదనలను సరైన కారణాలతో సమర్పించండి అని కొరడమైనది. ఈ మీటింగ్ లో గాజులరామారం . యు . వెంకటరాములు AERO & డిప్యూటీ కమిషనర్,శ్రీమతి ప్రమీల AERO & ఏ. ఎం. సి. , శ్రీమతి సుమిత్ర . బి . బాలకృష్ణ , ఎలక్షన్ సూపరింటెండెంట్ మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు .