
గాల్లో ప్రయాణికురాలు మృతి..
విమానం అత్యవసర ల్యాండింగ్
విమానం అత్యవసర ల్యాండింగ్
ముంబై నుండి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సుశీలాదేవి(89) అనే మహిళ గాల్లో అనారోగ్యానికి గురికావడంతో, విమానాన్ని ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ అనంతరం వైద్య బృందం ఆమెను పరీక్షించి మరణించినట్లు ప్రకటించింది. పోలీసులు ఫార్మాలిటీలు పూర్తి చేశారు. ఆ తర్వాత విమానం వారణాసికి పయనమైంది.
