యల్లాపురంలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర..

TEJA NEWS

యల్లాపురంలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర..
….
పాలకవీడు : పాలకీడు మండలంలోని యల్లాపురం గ్రామంలో యాదవుల కుల స్తులు గంగమ్మ తల్లి జాతరను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన మంద గంప ఎత్తుకొని బేరీల మోతలు, కోలాటాలు, భజనల నడుమ ముత్యాలు చేస్తూ ఊరేగింపుగా దేవాలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పలువురు కుల పెద్దలు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంట లతో గ్రామం బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పెద్ద గొల్ల చింతల చెరువు సైదులు, చింతలచెరువు సైదులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top