TEJA NEWS

నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు?

హైదరాబాద్:
సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ పెరిగిన ధరలు నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య వినియోగదారులపై , రాష్ట్ర ప్రభుత్వంపై కలిపి ప్రతినెలా భారీ ఆర్థిక భారాన్ని మోప నుంది,తెలంగాణ రాష్ట్రం లో గ్యాస్ వినియోగం గణ నీయంగా ఉంది. అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని వినియోగదారులు ప్రతి నెలా దాదాపు కోటి వరకు వంటగ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ ధరల పెరుగుదల నేరు గా వారిపై నెలకు అదనంగా రూ.50 కోట్ల భారాన్ని మోపనుంది. ఇది ఇప్పటికే అధిక ధరలతో సతమత మవుతున్న సామాన్య ప్రజలకు మరింత భారంగా మారనుంది.మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఈ ధరల పెరుగుదల కారణంగా అదనపు ఆర్థిక భారాన్ని ఎదుర్కోనుంది.

ఈ పథకం కింద రాష్ట్రంలో దాదాపు 42.90 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కేవలం రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తోంది. కేంద్రం ధరలు పెంచినప్పటికీ.. ఈ లబ్ధిదారులకు అదే ధరకు సిలిండర్‌ను సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది.

దీని ప్రకారం, పెరిగిన ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ చర్యతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులపై ప్రస్తుత ధరల పెరుగుదల ప్రభావం ఉండదు. అయితే.. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అదనంగా రూ. 21.45 కోట్లను భరించాల్సి ఉంటుంది.

ఇతర వినియోగదారుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. మహాలక్ష్మి పథకం పరిధిలోకి రాని దాదాపు 99.82 లక్షల మంది విని యోగదారులు ఈ ధరల పెరుగుదల కారణంగా తీవ్రంగా నష్టపోనున్నారు. వీరికి ఎలాంటి రాయితీ లేనందున.. వారు కొను గోలు చేసే ప్రతి సిలిండర్‌పై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇది వారి నెలవారీ ఖర్చులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.