
ఈ–కేవైసీ చేయించుకోండి… లేదంటే రేషన్ బంద్!
- జూలై 31 చివరి గడువు..
- FSC లబ్ధిదారులు వెంటనే (e-KYC) పూర్తి చేయాలని అధికారుల ఆదేశం
వనపర్తి జిల్లాలోని ఆహార భద్రత (FSC) కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని జిల్లా అధికారులు సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 75.75 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 24.25 శాతం మంది లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోపు తమకు కేటాయించిన రేషన్ దుకాణంలో ఈ–కేవైసీ పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు అనంతరం నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తహసీల్దార్లు, రేషన్ డీలర్లు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన లబ్ధిదారులతో ఈ–కేవైసీ పూర్తి చేయించాలని అధికారులు సూచించారు.