ఘనంగాబాబు జగన్ జీవన్ రామ్ 40వ వర్ధంతి

TEJA NEWS

ఘనంగాబాబు జగన్ జీవన్ రామ్ 40వ వర్ధంతి

వనపర్తి : స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతిని మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహానీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ 27 సంవత్సరాల పిన్న వయసులోనే బీహార్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అలా తొమ్మిది సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికై 50 ఏళ్ల పాటు భారత రాజకీయాలు అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్ని తెచ్చి కేంద్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ రవాణా శాఖ మొదలగు శాఖలకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక న్యాయం కోసం కృషి చేసిన యోధుడు అని అలాంటి వ్యక్తికి ప్రభుత్వం భారతరత్నను ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కవి పండితులు గిరి రాజు చారి కవి శేషుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయ కంటి నరసింహ శర్మ సామాజిక కార్యకర్త గంధం నాగరాజు ముస్లిం మైనార్టీ నేత బాలిమియా గాయకుడు చింతకుంట కుమ్మయ్య బహుజన నాయకుడు బంకల సురేష్ నాయకుడు శేఖర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top