
14 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఘట్కేసర్ ఫ్లై ఓవర్.. ఎట్టకేలకు నిధులు మంజూరు..
గత 14 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు ఇకపై శరవేగంగా ముందుకు సాగనున్నాయి. అయితే, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులను ప్రారంభించాలని డిప్యూటీ సీఎంకు మాజీ మంత్రి మల్లారెడ్డి వినతిపత్రం సమర్పించారు. అయితే, మల్లారెడ్డి వినతిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పనులు ప్రారంభించేందుకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
