TEJA NEWS

బీజేపీ నేతలచే పేదలకు అన్నదానం

తిరుపతి: భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు నల్లారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజు స్వామి దక్షిణ మాడ వీధిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు గుండాల గోపినాధ్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులుగా నల్లారెడ్డి సేవలందించారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది బిజెపిలో చేరి పార్టీ పటిష్టతకు కృషి చేశారని కొనియాడారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చంద్రారెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, అన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బంకు చంద్రారెడ్డి, నాగేంద్ర శర్మ, కరుణ్ తదితరులు పాల్గొన్నారు.