TEJA NEWS

పటాన్చెరు విద్యార్థులకు సువర్ణ అవకాశం..

ఈ విద్యా సంవత్సరం నుండే పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు

పారిశ్రామికవాడకు అనుగుణంగా కోర్సులు..

ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు

గతి ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నేడు అమలు చేశాం..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల భవనంలో 2025- 2026విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు శనివారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలిసి డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జీరో జారీ చేసింది అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమితో పాటు అధ్యాపక పోస్టులు, కోర్సులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

రాబోయే విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగంలో 60 సీట్లు చొప్పున 180 సీట్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలకు. AICTE గుర్తింపుతో పాటు SBTET అఫ్లీయేషన్ రావడం జరిగిందని తెలిపారు.

35 రెగ్యులర్ పోస్టులు.. 52 ఔట్సోర్సింగ్ పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన విద్యార్థులకు స్థానిక పారిశ్రామిక వాడలోని జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు.

భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ.ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల నాగరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.