TEJA NEWS

985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ ఏర్పాటు

ఏదుల రిజర్వాయర్ నుంచి నియోజకవర్గానికి లింకు కెనాల్ ఏర్పాటు

త్వరలోనే నియోజకవర్గానికి మరో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు

పదివేల కోట్లతో నిరుద్యోగ యువతకు రుణ సదుపాయం

_చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తుడిమేగారెడ్డి

వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం లో త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి లో, షాది ముబారక్, CMRF, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు

గత పాలకులు వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా చేశారని…
సమవుజ్జి గురించి మాట్లాడేవారు అవినీతిలో కాకుండా అభివృద్ధిలో సమవుజ్జిగా ఉంటే ఎంతో బాగుండేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు

తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు 15 నెలల కాలంలో 1000 కోట్ల అభివృద్ధి పనులు చేశానని మరో 1000 కోట్ల అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలను ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు
నియోజకవర్గంలో నిర్మించిన ఏదుల రిజర్వాయర్ తో ఒక్క చుక్క నీరు కూడా నియోజకవర్గానికి రాదని అలాంటి ఏదుల రిజర్వాయర్ నుంచి లింకు కెనాల్ ఏర్పాటుచేసి వనపర్తి నియోజకవర్గం లోని పలు మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

పదివేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రుణ సదుపాయం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు
నియోజకవర్గంలో పలు మండలాలలో 30 పడకల ఆసుపత్రులు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయ లక్ష్యంతో సొంత భవనాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు

ప్రతి నిరుపేద సైతం సంపన్నులు తినే భోజనాన్ని తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రతి ఒక్కరు రేషన్ షాపుల ద్వారా అందించే సన్నబియ్యాన్ని పొందాలని ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు

మహిళా అభ్యున్నత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుబడి ఉందని ఇందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల బలోపే దానికి సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఆర్టీసీ బస్సుల కొనుగోలు చేపట్టిందని ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

త్వరలోనే మహిళల భాగస్వామ్యంతో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్బులతో పాటు, మండలానికో అధునాతన పాఠశాలలను నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 207 లబ్ధిదారులకు 2,07,24,012 కోట్ల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు
అదేవిధంగా 791 మంది CMRF లబ్ధిదారులకు 2,07,63000 విలువగల చెక్కులను ఆయన అందజేశారు

కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు, పార్టీ శ్రేణులు, పెద్దలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, CMRF లబ్ధిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు