
పట్టణంలో రు.1.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ..
వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 32,31,23 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. విష్ణుకుండి నగర్, తారకరామా నగర్, రెడ్డి నగర్, కోట్నాల్సా బజార్లలో రు.1.2 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శిలాఫలకాల వద్ద కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగిందని, మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణానికి 3 కోట్లు నిధులు రావడం జరిగిందన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు , 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి , మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , కౌన్సిలర్లు, బిజెపి నాయకులు లెనిన్ జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ నిశంకర శ్రీనివాసరావు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
