TEJA NEWS

మృతదేహాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ..

వినుకొండ మండలం శివాపురం – రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, రామాంజి, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల దంపతులు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు ఎర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు.