
ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటానమస్ ) పాల్వంచ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో శుక్రవారం నాడు ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అధిపతులు శ్రీమతి లీలా సౌమ్య మరియు భాను ప్రవీణ్ మాట్లాడుతూ కవిత్వం మన భావోద్వేగాలను,అను భావాలను, ఆనందాన్ని మరియు బాధలను అందంగా వ్యక్తపరిచే అత్యంత సృజనాత్మకమైన రూపమని, కవిత్వం నిజ జీవితానికి ప్రాణం పోసే ఒక సాహిత్య ప్రక్రియ అని అన్నారు. షేక్స్పియర్, జాన్ కీట్స్, వర్డ్స్ వర్త్, టెన్నిసన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్ కె నారాయణ్, రాజారావు వంటి రచయితలు తమ రచనలలో జీవితం ప్రకృతి ప్రేమ మతం మానవత్వం భగవంతుడు స్వేచ్ఛ వంటి విషయాలను గూర్చి సృజనాత్మకంగా వివరించారని పేర్కొన్నారు. అధ్యక్ష ఉపన్యాసంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మ ఆంగ్ల భాష ప్రాధాన్యతను, ఉపాధి అవకాశాలను గూర్చి వివరిస్తూ, ఆంగ్ల విభాగ అధిపతులు రచించిన ఆంగ్ల కవితా సంపుటిని ఆవిష్కరించి అభినందించినారు.అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థులు పి పి టి ద్వారా ఆంగ్ల కవుల జీవితాలను, రచనలను మరియు రాగయుక్తంగా ఆంగ్ల కవితలు ఆలపించిన విధానం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షించినవి. ఆంగ్ల విభాగం అధిపతులు విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసినారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
