
ఆధునిక పద్ధతిలో సౌకర్యాలతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందించాలి……. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి జాన్ వెస్లీ డిమాండ్
ఖాళీ ఉద్యోగాల భర్తీకి ఈనెల 18న చేపట్టిన ధర్నాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
తెల్ల రేషన్ కార్డు పై బియ్యంతో పాటు 14 సరుకులను ఇవ్వాలని డిమాండ్
సాక్షిత వనపర్తి జులై 7
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కొరవడడం నిరుపేదలకు సరైన వైద్యం అందడం లేదని దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వారి ఆస్తుల్ని పోగొట్టుకోవడంతోపాటు అప్పులు మిగులుతున్నాయని అయినప్పటికీ ప్రాణాలు మిగలడం లేదని ( సిపిఎం) వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పేదలకు మెరుగైన ఆధునిక సౌకర్యాలతో వైద్యం అందించే విధంగా వైద్యంతోపాటు విద్యా ఉపాధి ల పై అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై420 హామీలపై రెండు నెలల పాటు సిపిఎం సిపిఐ (పార్టీల) వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం చేయనట్లు అందులో భాగంగానే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినట్లు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా నెలకు 25 వేల మంది రోగులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారని కానీ రోగులకు సరిపడా వైద్యులు సిబ్బంది ఆధునిక పరికరాలు ల్యాబ్ టెక్నీషియన్లు శానిటేషన్ సిబ్బంది అవసరం ఉన్నంతలేకపోవడం అలాగే సరైన ఆహారం మందులు, బెడ్లు లేకపోవడం నిరుపేదలకు సరైన వైద్యం అందడం లేదని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇదే పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో విద్యా వైద్యం ప్రైవేటీకరణ చేయడంతో వ్యాపారంగా మారిపోయిందని ప్రభుత్వ ఆసుపత్రులను విద్యా సంస్థలను సందర్శించే అక్కడ నెలకొన్న సమస్యలపై
అధ్యయనం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి విద్య వైద్యం పూర్తిగా ఉచితంగా
అందించ మెరుగు పరచడంతోపాటు ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేపట్టే విధంగా చట్టం తీసుకురావాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం పరిధిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈనెల 18న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
పేదలకు ఇచ్చిన రేషన్ కార్డు కేవలం 6 కేజీల బియ్యానికే పరిమితమైందని బియ్యంతో పాటు 14 నిత్యవసర సరుకులను కార్డు మీద ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు పెన్షన్ సమస్య ఉందని రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని వీరందరికీ ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని గత ప్రభుత్వం డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పేసి మోసం చేసిందని అందుకే ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని విస్మరించిందని ప్రభుత్వం వెంటనే నిధులను కేటాయించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అన్ని సమస్యలపై రెండు నెలలపాటు వామపక్షాలు కలిసి పోరాటాలు చేనున్నట్లు ఆయన తెలిపారు. మారుతున్న రాజకీయ ఎన్నికల సరలినీ దృష్టిలో ఉంచుకొని
ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ప్రజల్లో బలపడుతూ రాజకీయంగాను అధికారం పరంగాను ఎదగాలని వామపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఉద్యమాలకే పరిమితమై రాజకీయపరంగా అధికారానికి వామపక్షాలు దూరం అవుతున్నాయి అన్న విలేకరుల ప్రశ్నకు పైవీదంగా ఆయన బదులిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బర్ పుట్ట ఆంజనేయులు బొబ్బిలి నిక్సన్ మండ్ల రాజు
