TEJA NEWS

ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్ , హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి

అనారోగ్యంతో ఉన్న రిపోర్టర్ కు ఆర్థిక సహాయం అందించిన టీఎస్ జేఏ నాయకులు

సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు వెంటనే అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైనప్పటికిని ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వకపోవడంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆరోగ్యాలు బాగు చేసుకునే పరిస్థితి లేక ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మోతే మండలం ప్రజా దర్బార్ తెలుగు దినపత్రిక రిపోర్టర్ గట్టిగుండ్ల రామును శుక్రవారం అసోసియేషన్ నాయకులతో కలిసి పరామర్శించి అనంతరం యాదగిరి మాట్లాడారు. అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎలాంటి రాబడి లేకుండా ఉచిత ప్రజాసేవ ప్రభుత్వ సేవ చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. అక్రిడేషన్లు ఇచ్చే గడువు సంవత్సరకాలం క్రితమే పూర్తి అయినప్పటికిని ఇంకా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం విచారకరమన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి మోతే మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు క్యూ న్యూస్ రిపోర్టర్ ఏర్పుల సాయి కృష్ణ ఉపాధ్యక్షుడు ప్రజా జ్యోతి రిపోర్టర్ గురజాల వెంకన్న సిరివెన్నెల రిపోర్టర్ మండల సహాయ కార్యదర్శి దారమళ్ళ ఎలీషా తదితరులు పాల్గొన్నారు