
కామారెడ్డి జిల్లా విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ,జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయ బడుతుందని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తో పాటు 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామన్నారు.
పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ గ్రేహ్యాండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, osd దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, DSP శంకరయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పోలీసు, రెవిన్యూ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
