TEJA NEWS

పెనగలూరు మండలంలో
గోకులం షెడ్లు, సీసీ రోడ్లను
ప్రారంభించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ..!*

గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పాడి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకువస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దే అని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు.

ఈ రోజు రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం,అనంతంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ప్రారంభించారు. అనంతరం అనంతంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రార:బించారు.

ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ. .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన పాడి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకువస్తున్నట్లు తెలిపారు. గత 5ఏళ్లలో జగన్ రెడ్డి సర్కార్…ఒక్క గోకులాన్ని నిర్మించిన పాపాన పోలేదని, కానీ ఈ 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులం షెడ్లు నిర్మించిన కూటమి ప్రభుత్వానిదే అని అరవ శ్రీధర్ అన్నారు. భవిష్యత్తులో మరో 20 వేల గోకులాలు ఏర్పాటు చేసి, గోవులు, గోకులాలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మినీ గోకులాల ఏర్పాటులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పిలుపునిచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖ కింద గ్రామగ్రామానా సీసీ రోడ్లను నిర్మిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయుకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.